జిల్లాలో కేవీపల్లె జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఓటర్లలో ధైర్యాన్ని నింపేందుకు గర్నిమిట్ట గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు కేవీపల్లె జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి అధికారులు ముందుగానే కీలక సూచనలు, భద్రతా మార్గదర్శకాలు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా వ్యవహరించాలి, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు.











