వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 7వ తేదీన జరగనుంది. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన పోలీసు, ఇతర శాఖల సిబ్బందితో పాటు, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందనలు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించనున్నట్లు తెలిపారు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, పీలేరులోని సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాల, రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయ స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తామని పేర్కొన్నారు.





