సముద్రగర్భ రహస్యాలను వెలికితీసే దిశగా భారత్ కీలక ముందడుగు వేస్తోంది. 2028 నాటికి సుమారు 6,000 మీటర్ల సముద్ర లోతుల్లోకి ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లే మానవ సహిత సముద్రయానాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండో-పసిఫిక్ రీజినల్ డైలాగ్ () 2026లో మాట్లాడుతూ, ఆయన భారతదేశ సముద్ర పరిశోధన సామర్థ్యాల గురించి వివరించారు. సముద్ర విజ్ఞానం, అంతరిక్ష సాంకేతికత, రోబోటిక్స్, భూగర్భ శాస్త్రం వంటి విభాగాలను అనుసంధానిస్తూ పరిశోధనలు చేపడుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముగ్గురిని తీసుకెళ్లనున్న మత్స్య
భారతదేశ సముద్రయాన కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మత్స్య సబ్మెర్సిబుల్ ముగ్గురు ఆక్వానాట్లను 5,000 నుంచి 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లేలా రూపొందిస్తున్నారు. ఈ వాహనం ద్వారా సముద్రగర్భంలోని భౌగోళిక నిర్మాణాలు, ఖనిజ వనరులు, జీవవైవిధ్యంపై పరిశోధనలు చేపట్టనున్నారు.












