దేశవ్యాప్తంగా బిగ్ బజార్ రిటైల్ సామ్రాజ్యాన్ని విస్తరించిన ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు కిషోర్ బియానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు కిషోర్ బియానీ, రాకేష్ బియానీలపై రూ.904.32 కోట్ల బ్యాంకు మోసం ఆరోపణలతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముంబైలోని స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కిషోర్ బియానీ, ఆయన సోదరుడు రాకేష్ బియానీతో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎస్బీఐ ఫిర్యాదు ప్రకారం.. ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఎస్బీఐతో పాటు తొమ్మిది బ్యాంకుల కన్సార్టియం నుంచి వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్లు, లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో రుణ సదుపాయాలు పొందింది. అయితే మంజూరైన రుణాలను నిర్దేశించిన వ్యాపార అవసరాలకు వినియోగించకుండా అనుబంధ సంస్థలు, సంబంధిత కంపెనీల ద్వారా ఇతర మార్గాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.





