జమ్మలమడుగు, జులై 02
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాల్ల పల్లె గ్రామం వద్ద రాయలసీమ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవితమ్మ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాల్ల పల్లె గ్రామం వద్ద రాయలసీమ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల పరిశీలన కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి సవితమ్మ, జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి పరిశీలించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు పుత్త చైతన్య రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ పెళ్ళకూర శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, మాజీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











