పార్వతీపురం జిల్లా బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు వేర్వేరు రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. భర్త టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థికి భార్య మద్దతుగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
బొబ్బిలి పట్టణంలోని 17వ వార్డులో కోసూరు బ్రహ్మాజీ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా వైఎస్సార్సీపీ తరఫున కొమ్మోజు హరిబాబు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి తూముల అచ్యుతవల్లి, కౌన్సిలర్ అభ్యర్థి హరిబాబుతో కలిసి ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్రచారంలో కోసూరు బ్రహ్మాజీ భార్య కోసూరు జయలక్ష్మి కూడా పాల్గొని, వైఎస్సార్సీపీ కండువా ధరించి హరిబాబును గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. ఈ పరిణామం పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది.











