హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ది ఫర్దర్ మిస్-అడ్వెంచర్స్ ఆఫ్ క్లిఫ్ బూత్ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. 2019లో వచ్చిన వన్స్ అపాన్ ఎ టైమ్... ఇన్ హాలీవుడ్ చిత్రంలోని క్లిఫ్ బూత్ పాత్రలో బ్రాడ్ పిట్ మరోసారి కనిపించనున్నారు.
ఈ కథ 1977 నేపథ్యంలో సాగుతుంది. గతంలో స్టంట్‌మ్యాన్‌గా పనిచేసిన క్లిఫ్ బూత్, ఇప్పుడు హాలీవుడ్లో సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా కొత్త బాధ్యతలు చేపడతాడు. అప్పటి సినీ పరిశ్రమలో ఎదురయ్యే వివాదాలు, సవాళ్ల చుట్టూ కథ నడుస్తుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సినిమా వివరాలు
ఈ చిత్రానికి డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహిస్తుండగా, క్వెంటిన్ టరంటినో కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఎలిజబెత్ డెబికీ, స్కాట్ కాన్, కార్లా గుగినో, యాహ్యా అబ్దుల్-మతీన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.












