జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం డ్రాగన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ధురంధర్ చిత్రానికి సంగీతం అందించి గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ ఈ సినిమాకు పనిచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శాశ్వత్ సంగీతం అందించే అవకాశాలున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇప్పటికే ది ఇండియా హౌస్ సినిమా ద్వారా శాశ్వత్ సచ్దేవ్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ఆయన ప్రతిభను ప్రశంసించారు. మరిన్ని తెలుగు సినిమాలకు ఆయన సంగీతం అందించాలని ఆకాంక్షించారు.












