రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్లో అరుదైన ఘనత సాధించింది. ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) సమయంలోనే 100 బిలియన్ డాలర్లకు పైగా విలువను సాధించిన ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల జాబితాలో చేరింది. స్టాక్ మార్కెట్లలో నమోదైన జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు ఇష్యూ ధరతో పోలిస్తే 21 శాతానికి పైగా ప్రీమియంతో ప్రారంభమయ్యాయి.
దీంతో సంస్థ మార్కెట్ విలువ సుమారు రూ.12.6 లక్షల కోట్లకు చేరింది. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.1,119గా నిర్ణయించగా, స్టాక్ మార్కెట్లో నమోదైన సమయంలో షేరు ధర రూ.1,358కు చేరింది. ఇది ఇష్యూ ధరతో పోలిస్తే 21.4 శాతం అధికం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశంలోనే అత్యంత విలువైన టెలికాం సంస్థగా జియో
ఈ పరిణామంతో జియో ప్లాట్‌ఫామ్స్ దేశంలోనే అత్యంత విలువైన టెలికాం సంస్థగా అవతరించింది. మార్కెట్ విలువ పరంగా భారతీ ఎయిర్‌టెల్‌ను అధిగమించి, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలో రెండో అత్యంత విలువైన లిస్టెడ్ సంస్థగా నిలిచింది. జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.30,213 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది.












