వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకోనున్నారు. ఆయన పులివెందులలో పర్యటించి, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించనున్నారు.
మంగళవారం ఉదయం 10.30 గంటలకు పులివెందులకు చేరుకుని, భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రి పులివెందులలోని తన నివాసంలో బస చేసి, బుధవారం ఉదయం తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ భాకరాపురం క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజలను కలవనున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతోనూ సమావేశమై స్థానిక పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు.











