సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో భద్రతాపరమైన ముప్పు నేపథ్యంలో పౌర రక్షణ విభాగం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. జాతీయ ఎమర్జెన్సీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, కిటికీలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అనంతరం రియాద్‌లో ప్రమాదం తొలగిపోయిందని ప్రకటించారు. అయితే యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రియాద్‌లోని సౌదీ అరామ్కో కార్యాలయ భవనంపై జరిగిన దాడి ప్రయత్నంలో స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
డాక్సిన్ టైమ్స్: రియాద్‌లో భద్రతా ముప్పుపై పౌర రక్షణ విభాగం హెచ్చరిక

Share:
వార్తలుతాజా
రిపోర్టర్ గురించి
DT
Desk Team 2
Reporter
ఈ వార్త









