తెలంగాణలో చెరువులు ఎండిపోవడం, తాగునీటి కొరత, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వర్షాలతో నిండిన చెరువులు ప్రస్తుతం ఎండిపోవడంతో గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించడమే కష్టంగా మారిందని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వర్గాలు ఆరోపిస్తున్నాయి.
రైతులకు సాగునీరు అందించాల్సిన సమయంలో నీటి లభ్యతపై ఆందోళన నెలకొందని విమర్శకులు పేర్కొంటున్నారు. చెరువులు, కుంటల్లో నీరు తగ్గిపోవడం వల్ల పశువులకు నీరు, పంటలకు సాగునీరు అందించడం కష్టమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఈ పోస్టులో పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వ్యవసాయ విద్యుత్ సరఫరాపై అసంతృప్తి
రైతులకు రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు గంటల పాటు కూడా విద్యుత్ అందడం లేదని పోస్టులో ఆరోపించారు. సాగు పనులు సజావుగా సాగాలంటే విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండాలని, తక్కువ వోల్టేజీ, విద్యుత్ కోతలు ఉంటే మోటార్ల ద్వారా నీటిని తోడుకోవడం కష్టమవుతుందని రైతుల సమస్యను ప్రస్తావించారు.











