ఆంధ్రప్రదేశ్‌లోని యలమంచిలి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం ఆసక్తికరంగా మారింది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ, ఓట్ల తేడాలు చర్చనీయాంశమవుతున్న వేళ ఈ ఫలితం ప్రత్యేకంగా నిలిచింది.
యలమంచిలి మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. చైర్పర్సన్ పదవికి బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా పిల్లా రమాకుమారి, వైఎస్సార్సీపీ తరఫున బొద్దపు తులసి, కాంగ్రెస్ తరఫున దొడ్డి శాంతి పోటీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చైర్పర్సన్ ఎన్నిక ఫలితాలు
చైర్పర్సన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పిల్లా రమాకుమారికి 15,129 ఓట్లు, వైఎస్సార్సీపీ అభ్యర్థి బొద్దపు తులసికి 11,324 ఓట్లు లభించాయి. రమాకుమారి 3,805 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.











