విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు2026పై పార్లమెంటరీ సంయుక్త కమిటీ తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సమావేశమైంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన దాదాపు 40 సంస్థల ప్రతినిధులు పాల్గొని బిల్లుపై తమ అభిప్రాయాలను, సూచనలను, అభ్యంతరాలను కమిటీ ముందు ఉంచారు.
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునే ప్రక్రియలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన సుమారు 40 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సమావేశానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ సంజయ్ జైస్వాల్ అధ్యక్షత వహించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా అభ్యర్థన మేరకు షిల్లాంగ్‌ను సమావేశ వేదికగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లిఖితపూర్వక సూచనలు కోరిన కమిటీ
సమావేశంలో పాల్గొన్న సంస్థలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా మరో 15 రోజుల్లోగా సమర్పించాలని కమిటీ సూచించింది. అనంతరం కొచ్చి, చెన్నై నగరాల్లోనూ సంప్రదింపుల సమావేశాలు నిర్వహించనున్నట్లు సంజయ్ జైస్వాల్ వెల్లడించారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు ఎదురయ్యే ఆచరణాత్మక సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూనే, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలను నిరోధించేలా చట్టాన్ని రూపొందించడమే కమిటీ లక్ష్యమని ఆయన వివరించారు.












