గురుగ్రామ్‌లోని అంబియెన్స్ మాల్లో దీపావళి పండుగ సందర్భంగా ది డివైన్ రేడియన్స్ పేరుతో 20 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అద్భుత కళాఖండాన్ని 2,51,000 అద్దపు మొజాయిక్ ముక్కలతో రూపొందించారు.
గురుగ్రామ్, హర్యానా: గురుగ్రామ్‌లోని అంబియెన్స్ మాల్లో భక్తులను ఆకట్టుకునే అద్భుత కళాఖండాన్ని ఏర్పాటు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ది డివైన్ రేడియన్స్ పేరుతో 20 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విగ్రహాన్ని 2,51,000 అద్దపు మొజాయిక్ ముక్కలతో రూపొందించారు. దీని తయారీకి కళాకారులు మొత్తం 360 గంటల సమయాన్ని వెచ్చించారు. సంప్రదాయ భారతీయ కళా నైపుణ్యం, ఆధునిక కళాత్మకత కలగలిపి ఈ అద్భుత ప్రతిమను తీర్చిదిద్దారు.












