హైదరాబాద్‌లో అక్రమంగా మానవ అండాలను సేకరించి, వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 43 మంది మహిళలను డబ్బు ఆశ చూపి ఇక్కడికి తరలించి, అండాల సేకరణ ప్రక్రియకు సిద్ధం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ముఠాతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఒక్కో అండం దానం ప్రక్రియకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తామని ముఠా సభ్యులు ఆశ చూపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఏజెంట్ల ద్వారా మహిళలను గుర్తించి హైదరాబాద్‌కు తరలించి, అద్దె ఇళ్లు, హాస్టళ్లలో ఉంచినట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం వారిని ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్), ఫెర్టిలిటీ కేంద్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు, కొందరు మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు, మందులు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.







