ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరగనున్న ఇండియా కూటమి ర్యాలీ నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సెంట్రల్ ఢిల్లీ డీసీపీ రోహిత్ రాజ్బీర్ తెలిపారు. ర్యాలీ జరిగే ప్రాంతమంతటినీ పర్యవేక్షించేందుకు సుమారు 200 నుంచి 250 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ర్యాలీ జరిగే ప్రాంతమంతటినీ పర్యవేక్షించేందుకు సుమారు 200 నుంచి 250 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు కూడా భద్రతా విధుల్లో పాల్గొంటాయని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ర్యాలీ నిర్వాహకులతో పోలీసులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ర్యాలీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు.











