ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరిందని, సైనిక దాడులను తీవ్రతరం చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పరిస్థితులు మారితే సైన్యం చర్యలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనికంగా దాదాపు ఓడిపోయిందని, యుద్ధం ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నట్లు ఉందని ఆయన పేర్కొన్నారు. ఖతార్ ప్రధానితో సమావేశమైన అనంతరం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రస్తుతానికి సైనిక దాడులను మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం కనిపించడం లేదని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే యుద్ధం అధికారికంగా ముగిసిందని ఆయన ప్రకటించలేదు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారం రావాల్సి ఉందని స్పష్టం చేశారు. పరిస్థితులు మారితే అమెరికా సైన్యం మళ్లీ చర్యలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.











