ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురైన పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్థానికంగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య గతంలోనూ వివిధ అంశాలపై విభేదాలు బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య గతంలో వివాదం తలెత్తింది. నగర పంచాయతీ సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఈ అంశం రాజకీయంగా చర్చకు వచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అనంతరం టీడీపీ నాయకులు నిర్వహించిన సమావేశంలో మాధవిపై విమర్శలు చేయడం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేరు లేకపోవడం కూడా గతంలో వివాదానికి కారణమైంది. ఈ అంశంపై జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు వార్తలు వెలువడ్డాయి.





