Srikakulam/Regidi Amadalavalasa (డాక్సిన్ టైమ్స్) జూలై 21
కామారెడ్డి జిల్లాలో ఆహార భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఫుడ్ సేఫ్టీ శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. తిమ్మాజివాడలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ వాహనంతో సందర్శించి, కల్తీని గుర్తించే పరీక్షలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
కామారెడ్డి జిల్లాలో ఆహార భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఫుడ్ సేఫ్టీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాజివాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి. విక్రమ్, ల్యాబ్ టెక్నీషియన్ తిరుపతి కలిసి ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ వాహనంతో పాఠశాలలను సందర్శించి ఆహార భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం తయారీలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వంట సిబ్బందికి సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఆహారాన్ని ఎల్లప్పుడూ కప్పి ఉంచడం, స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించడం, వంటగదిని పరిశుభ్రంగా నిర్వహించడం ద్వారా ఆహార సంబంధిత వ్యాధులను నివారించవచ్చని వివరించారు.
అనంతరం ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో ల్యాబ్ టెక్నీషియన్ తిరుపతి పాలు, పసుపు వంటి నిత్యావసర ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించే పరీక్షలను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. కల్తీ ఆహారం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, నాణ్యమైన ఆహారాన్ని గుర్తించే పద్ధతులపై విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు.












