కామారెడ్డి, జూలై 21
కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. భారత సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుపై అధికారులు చర్చించారు. ఈ సమీక్షకు అదనపు కలెక్టర్ విక్టర్ అధ్యక్షత వహించారు.
కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడంపై కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత సుప్రీంకోర్టు Suo Motu W.P.(C) No.9/2025 (In Re: Phalodi Accident) కేసులో జారీ చేసిన ఆదేశాల అమలుపై అధికారులు విస్తృతంగా చర్చించారు.
సమావేశానికి అదనపు కలెక్టర్ విక్టర్ అధ్యక్షత వహించగా, ఎన్హెచ్ఏఐ డీజీఎం ఆర్. శాలిని, ఆర్అండ్బీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్, జిల్లా రవాణా అధికారి టి. సంతోష్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్స్పాట్ల గుర్తింపు, వాటి సత్వర పరిష్కారం, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్ మార్కింగ్స్, క్రాష్ బ్యారియర్లు, స్ట్రీట్ లైటింగ్, రోడ్డు భద్రతా మౌలిక వసతుల అభివృద్ధి, అత్యవసర వైద్య స్పందన వ్యవస్థ బలోపేతం, రహదారి ఇంజినీరింగ్ లోపాల సవరణ వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని అధికారులు ప్రస్తావించారు.









