కామారెడ్డి, 4 September
కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని డీజే ఆపరేటర్లకు డీజేల నిర్వహణపై పోలీసులు అవగాహన కల్పించారు. రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా డీజేలు ఏర్పాటు చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ గారు స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈరోజు కామారెడ్డి పోలీస్ స్టేషన్ నందు కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని డిసి ఆపరేటర్లకు కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారికి కామారెడ్డి డి.ఎస్.పి గారి ఆధ్వర్యంలో డీజే నిర్వహణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది దీనిలో డీజే నిర్వాహకులకు ఈ రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎవరూ కూడా డీజే పెట్టకూడదని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా డీజీలు పెట్టకూడదు, పోలీసు వారి నియమ నిబంధనలను ఉల్లంఘించినచో వారిపై పోలీసు వారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా కామారెడ్డి డి.ఎస్.పి శ్రీ మధుసూదన్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఇన్స్పెక్టర్ నరహరి కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ మరియు దేవనపల్లి ఎస్సై రంజిత్ పాల్గొన్నారు.












