కామారెడ్డి, 4 September
కామారెడ్డి: ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో 5253వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రామారెడ్డి రోడ్డులోని ఇస్కాన్ కామారెడ్డి కేంద్రంలో ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇస్కాన్ కామారెడ్డిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు కామారెడ్డి: ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో 5253వ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రామారెడ్డి రోడ్డులోని ఇస్కాన్ కామారెడ్డి ప్రచార కేంద్రంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులకు దివ్యదర్శనం, అర్చన, హారతి, అభిషేకం నిర్వహించడంతో పాటు శ్రీకృష్ణ ప్రసాదాన్ని అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.












