కామారెడ్డి, 2026-08-31
కంటి దానంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఉచిత నేత్ర పరీక్షల క్యాంప్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 175 మందికి కంటి పరీక్షలు చేయగా, 113 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు, కంటి దానంపై ప్రజల్లో అవగాహన పెంచడం, స్వచ్ఛంద నేత్రదాన ప్రతిజ్ఞలను ప్రోత్సహించడం, కార్నియల్ దానానికి సంబంధించిన అపోహలు, మూఢనమ్మకాలను తొలగించే లక్ష్యంతో ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8, 2026 వరకు తెలంగాణ వ్యాప్తంగా 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా, కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.










