కన్యా రాశి వారికి 2026 విశ్వావసు నామ సంవత్సరం తెలివితేటలకు పరీక్షా కాలంగాను, క్రమశిక్షణతో విజయం సాధించేలానూ ఉంటుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి, ఈ ఏడాది తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి.
ఆర్థికంగా, ఆదాయం క్రమంగా పెరుగుతుందని, గతంలో ఆగిపోయిన సొమ్ము చేతికందుతుందని అంచనా. పొదుపు మంత్రం బాగా పని చేస్తుందని, వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం అని సూచించారు. అయితే, స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న రంగాల్లో ఎవరినో నమ్మి డబ్బులు పెట్టడం కంటే సొంత నిర్ణయాలే మేలు చేస్తాయని తెలిపారు. విద్యా సంబంధిత విషయాలకు లేదా తీర్థయాత్రలకు ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వృత్తిపరంగా, ఉద్యోగస్థుల పనితీరు మెరుగ్గా ఉంటుందని, నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుందని అంచనా. సెప్టెంబర్ తర్వాత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందని, వ్యాపారస్తులు నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారని తెలిపారు. ముఖ్యంగా మీడియా, అకౌంటింగ్, మరియు టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి ఈ ఏడాది లాభసాటిగా ఉంటుందని, శత్రువుల మీద విజయం సాధిస్తారని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం ఉంటుందని, అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చునని, సంయమనం పాటిస్తే సమస్యలు తొలగిపోతాయని సూచించారు. ఆరోగ్యం విషయంలో, చర్మ సంబంధిత లేదా జీర్ణ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సమయానికి నిద్రపోవడం, తగినంత నీరు తాగడం ముఖ్యం అని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఆటంకాలు తొలగి, బుధగ్రహ అనుగ్రహం లభించడానికి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, గణపతి ఆరాధన, గోసేవ, "ఓం బుం బుధాయ నమః" మంత్ర జపం, మరియు ఆకుపచ్చని వస్త్రాలు లేదా పచ్చ పెసరపప్పు దానం వంటి పరిహారాలు పాటించాలని జ్యోతిష్య పండితులు సూచించారు. ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉండటం సానుకూల అంశం, కానీ అనవసర విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితోనూ అతిగా వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచన.









