ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ () నుంచి వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం మహాకాళి నుంచి తొలి పాట ఐగిరి నందినిని చిత్రబృందం విడుదల చేసింది. ఆదిశంకరాచార్యుల స్తోత్రానికి ఆధునిక సంగీత హంగులు జోడించి రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ () నుంచి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం మహాకాళి సంగీత ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నుంచి తొలి పాట ఐగిరి నందినిని చిత్రబృందం విడుదల చేసింది. ఆదిశంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ స్తోత్రానికి ఆధునిక సంగీత హంగులు జోడించి రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్మరణ్ సాయి ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చడంతో పాటు ప్రోగ్రామింగ్, అరేంజ్మెంట్స్ బాధ్యతలు కూడా నిర్వహించారు. అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ గాత్రం అందించారు. వీణ, వేణువు, గిటార్, పియానో, తవిల్, మృదంగం వంటి వాయిద్యాలను ఉపయోగించి భక్తి భావాన్ని, భారీ సంగీత అనుభూతిని కలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాటలో నటి శ్రీయా రెడ్డి మహాకాళి దేవి రూపంలో కనిపించారు. బహుళ హస్తాలతో కూడిన అమ్మవారి ఉగ్రరూపంతో పాటు, మాతృత్వాన్ని ప్రతిబింబించే దృశ్యాలనూ చిత్రీకరించారు. ముఖ్యంగా అమ్మవారు శిశువుకు పాలిచ్చే దృశ్యం పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హనుమాన్తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టి టైటిల్ పాత్రలో నటిస్తుండగా, అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.











