మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజా పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రజలు అందించిన వినతిపత్రాలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సుమారు మూడు గంటల పాటు కొనసాగిన ఈ ప్రజా పరిష్కార వేదికలో మంత్రి 150 అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు మంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించారు. అందిన ఫిర్యాదుల్లోని సంబంధిత అంశాలపై అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి, సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.











