నేరం చేసిన వారికి శిక్ష విధించడమే కాకుండా, వారిలో పరివర్తన తీసుకొచ్చి సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించడం కూడా ముఖ్యమని పంజాబ్-హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి ముందస్తు విడుదల అభ్యర్థనను తిరస్కరించిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
జస్టిస్ సుమీత్ గోయెల్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తుల్లో మార్పు తీసుకురావడం, వారిని సమాజంలో తిరిగి కలిసేలా చేయడం సంక్షేమ రాజ్య లక్ష్యమని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హర్యానాకు చెందిన ముఖేశ్ అనే వ్యక్తి 2010లో మరో ముగ్గురితో కలిసి జరిగిన ఒక నేరంలో దోషిగా తేలాడు. పానిపట్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే అతనితో పాటు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు సహ నిందితులకు ముందస్తు విడుదలకు అనుమతి లభించినప్పటికీ, ముఖేశ్‌కు మాత్రం ప్రభుత్వం ఆ అవకాశం కల్పించలేదు. దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. గతంలోనూ ఈ అంశంపై న్యాయస్థానాన్ని సంప్రదించగా, సహ నిందితులతో సమాన పరిస్థితుల్లో ఉంటే అతనికీ అదే ప్రయోజనం కల్పించాలని కోర్టు సూచించింది. అయినప్పటికీ అధికారులు అతని అభ్యర్థనను తిరస్కరించారు. 2024న మరోసారి ముందస్తు విడుదల అభ్యర్థనను తోసిపుచ్చి, ఏడాది తర్వాత తిరిగి పరిశీలిస్తామని తెలిపారు. దీంతో ముఖేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు.












