పార్టీ
పంజాబ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పంజాబ్‌లోని చండీగఢ్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశానికి ముందు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్ల తొలగింపుపై తమ ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. పంజాబ్‌లో ఈ అంశంపై ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజల్లోకి సమస్యను ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై జిల్లా స్థాయి నాయకులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.












