అనంతపురం, జూన్ 28
రాజకీయ గుర్తింపు కోసమే వైకాపా, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేలుస్తోందని జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రజాపాలనను జీర్ణించుకోలేకనే వైకాపా ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.
రాజకీయ గుర్తింపు కోసమే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ పై వైకాపా అవాకులు చెవాకులు పేలుస్తోందని జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ ఆరోపించారు. కూటమి ప్రజాపాలనను జీర్ణించుకోలేకనే వైకాపా ఆరోపణలు చేస్తోందన్నారు.
జగన్ పాలేరులైన అంబటి, పేర్ని నానిలకు వైకాపా తరఫున ముఖ్యమంత్రి పదవి కాపులకు ఇవ్వమని అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. అలా అడిగిన వెంటనే జగన్ వారిని గేటు బయట తన్ని తగిలేయడం ఖాయమని ఎద్దేవా చేశారు.
జగన్ కోసం పనిచేసే మీకు, జనం కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి ఎక్కడుందని వరుణ్ ప్రశ్నించారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అనవసర ఆరోపణలు చేస్తే వైసిపి నేతల్లారా ఇచ్చి పడేస్తామని హెచ్చరించారు.
పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నగర కమిటీ నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.











