పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాన్ మద్యం అలవాటును మానుకోవాలని, అప్పుడే పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో పంజాబ్, హర్యానా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
సంగ్రూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ భగవంత్ మాన్‌పై మద్యం సేవనానికి సంబంధించిన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో తనతో కలిసి ఉన్న సమయంలో ఉదయం 11 గంటలకే భగవంత్ మాన్ నోటి నుంచి మద్యం వాసన వచ్చేదని రాహుల్ వ్యాఖ్యానించారు. మద్యం సేవించడం వ్యక్తిగత విషయమే అయినప్పటికీ, మాదకద్రవ్యాల సమస్యతో పోరాడుతున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని విమర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హర్యానా సీఎం విమర్శలు
రాహుల్ వ్యాఖ్యలను గతంలో సమర్థించిన నాయబ్ సింగ్ సైనీ తాజాగా మరోసారి భగవంత్ మాన్‌పై విమర్శలు గుప్పించారు. మాన్ మద్యం తాగడం మానేస్తేనే మత్తు పదార్థాల సమస్యను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.








