ప్రపంచ ఇంధన దినోత్సవం సందర్భంగా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమాంతరంగా కొనసాగాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పచ్చదనంతో కూడిన భూమిని అందించాలంటే ఇంధన వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడంతో పాటు సహజ వనరులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
పర్యావరణానికి హాని తగ్గించేలా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛమైన ఇంధన వనరులను విస్తృతంగా వినియోగించడం ద్వారా ప్రకృతిపై ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. సహజ వనరుల సంరక్షణ, ఇంధన పొదుపు, పర్యావరణహిత జీవన విధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు నిర్మించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇంధనాన్ని అవసరానికి అనుగుణంగా వినియోగించడం, వృథాను తగ్గించడం, పర్యావరణానికి మేలు చేసే పద్ధతులను అనుసరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధన వినియోగం వైపు వేసే ప్రతి అడుగు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని ఆయన వివరించారు.












