కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోండు కొసరా గ్రామానికి చెందిన రైతు కార్పెత లక్ష్మణ్ రావు తన మూడు ఎకరాల పత్తి పంటను పశువులతో మేపి నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ ఆయన సోమవారం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.
మండలం బంబారా గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 111/లో తనకు చెందిన వ్యవసాయ భూమిలో పత్తి పంట సాగు చేసినట్లు లక్ష్మణ్ రావు తెలిపారు. న కొట్నాక కిష్టు, జెంరావ్, భీంరావ్, సోయం సురేష్, కొట్నాక మెంగు, కనక పాండు, కనక సురేష్ అనే వ్యక్తులు తమ పశువులను తన పొలంలోకి తీసుకువచ్చి సుమారు మూడు ఎకరాల పత్తి పంటను మేపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పంటకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని లక్ష్మణ్ రావు ఆరోపించారు. తనకు జరిగిన నష్టంపై సంబంధిత అధికారులు స్పందించి, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.











