కడప, 1 నవంబర్ 2026
పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను అనుమతించడం లేదని, అధికార పార్టీ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 70 మంది ఏజెంట్లతో కలిసి ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పులివెందుల మున్సిపాలిటీలోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాలలో 70 కేంద్రాల్లో తమ పార్టీ ఏజెంట్లను లోపలికి అనుమతించలేదని జగన్ ఆరోపించారు. ఉదయం నుంచే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్ద ఆధిపత్యం చెలాయిస్తూ, తమ పార్టీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని విమర్శించారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి కూడా సమాన అవకాశం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.











