రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి లోతైన కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ఈ ఘటన న ఉదయం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా ముల్తాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘాట్బిరోలి గ్రామానికి చెందిన పలువురు బంధువులు రాజస్థాన్‌లోని ఖాటు శ్యామ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. వారు భోపాల్ నుంచి శుక్రవారం రాత్రి ప్రయాణం ప్రారంభించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆలయానికి వెళ్తుండగా, శనివారం ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో కోటా జిల్లాలోని సిమ్లియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి సుమారు 15 అడుగుల లోతున్న కాలువలో పడిపోయింది. వాహనంలో ఉన్నవారిలో ఎక్కువ మంది నిద్రలో ఉండటంతో, ప్రమాదం నుంచి బయటపడేందుకు ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.












