రాష్ట్రంలోని
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించే పీ.ఎం రాహత్ పథకంలో అన్ని నెట్ వర్క్ హాస్పిటల్స్ ను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ఈ పథకం కింద గోల్డెన్ అవర్ లో చికిత్సలకు లక్షన్నర వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన మంత్రి రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్సా పథకం (పీ.ఎం రాహత్) అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు, రవాణా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో రవాణా శాఖ కమీషనర్ ఇలంబర్తి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, ఆరోగ్య శ్రీ సి.ఈ.ఓ జెండగి హనుమంతు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తక్షణమే గోల్డెన్ అవర్ లో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చితే, పీ.ఎం రాహత్ పథకం కింద లక్షన్నర రూపాయ విలువైన చికిత్సలు అందించడం జరుగుతుందని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. అయితే, ఈ పథకంలో హాస్పిటల్స్ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.











