పశ్చిమ బెంగాల్‌లోని కేనింగ్ (పశ్చిమ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ రామ్ దాస్‌ను ఎన్నికల టికెట్ పేరుతో రూ.4 లక్షలు డిమాండ్ చేసి, మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, పరేష్ రామ్ దాస్‌పై అత్యాచారం, దాడి, మోసం, నేరపూరిత కుట్ర, బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలు నమోదైన కేసులో ఉన్నాయి. 2023 పంచాయతీ ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని చెప్పి, మహిళ భర్త నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణ.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డబ్బులు ఇచ్చేందుకు వచ్చిన మహిళను ఒక వృద్ధాశ్రమంలో నిర్బంధించి అత్యాచారం చేశారని ఫిర్యాదు అందింది. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని బెదిరించారని, ఇంటిపై బాంబు దాడి జరిగిందని కూడా ఆరోపణలు ఉన్నాయి.









