భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి తన సాంకేతిక సామర్థ్యాన్ని చాటుకుంది. ఉపగ్రహంలోని కొన్ని కీలక సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించి ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపినట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. సాధారణంగా ప్రయోగానికి ముందు మూసి ఉంచాల్సిన పైరో వాల్వ్‌లను తెరిచిన స్థితిలోనే ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి తన సాంకేతిక సామర్థ్యాన్ని చాటుకుంది. ఉపగ్రహంలోని కొన్ని కీలక సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించి ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపినట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. సాధారణంగా ప్రయోగానికి ముందు మూసి ఉంచాల్సిన పైరో వాల్వ్‌లను తెరిచిన స్థితిలోనే ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఎన్వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో ఇస్రో సాధారణ విధానానికి భిన్నంగా వ్యవహరించింది. ఉపగ్రహంలోని ప్రొపల్షన్ వ్యవస్థలో కీలకమైన మూడు పైరో వాల్వ్‌లను ముందుగానే తెరిచిన స్థితిలో ఉంచి ప్రయోగించారు. ఈ నిర్ణయం వెనుక గతంలో ఎదురైన సాంకేతిక వైఫల్యమే ప్రధాన కారణంగా ఉంది. పైరో వాల్వ్‌లు అనేవి ఉపగ్రహంలోని ఇంధనం, ఆక్సిడైజర్ వంటి పదార్థాల ప్రవాహాన్ని నియంత్రించే ప్రత్యేక కవాటాలు. సాధారణంగా ప్రయోగ సమయంలో ఇవి మూసి ఉంటాయి. ఉపగ్రహం నిర్ణీత దశకు చేరుకున్న తర్వాత విద్యుత్ సంకేతం ద్వారా వీటిని తెరుస్తారు. ఒక్కసారి తెరిచిన తర్వాత మళ్లీ మూసివేయడం సాధ్యం కాదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో ఈ వాల్వ్‌లను తెరిచేందుకు పంపిన విద్యుత్ సంకేతం సరిగా చేరకపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో ఈసారి ప్రయోగానికి ముందే వాల్వ్‌లను తెరిచి ఉంచాలని ఇస్రో నిర్ణయించింది. ఉపగ్రహంలోని ఇంజిన్‌కు ఆక్సిడైజర్ సరఫరా చేసే వాల్వ్‌కు విద్యుత్ సంకేతం చేరకపోవడంతో ఇంజిన్ పనిచేయలేదు. ఫలితంగా ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యకు చేరుకోలేకపోయింది. ఈ ఘటనపై మాజీ ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ విచారణ చేపట్టింది. ప్రధాన, ప్రత్యామ్నాయ విద్యుత్ మార్గాల్లో కనెక్టర్‌కు సంబంధించిన కనీసం ఒక కాంటాక్ట్ విడిపోవడం వల్లే సంకేతాల సరఫరాలో సమస్య తలెత్తి ఉండవచ్చని కమిటీ నిర్ధారించింది.












