కామారెడ్డి, 2026-07-29
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పుష్పరాజ్ సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు కీలక సూచనలు చేశారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పుష్పరాజ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.
పాత లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండేవారు దూరంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లరాదు. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులను దాటకూడదు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.
చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరైనా నదుల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుగట్లు, పొంగిపొర్లుతున్న వాగుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని ఎస్సై పుష్పరాజ్ సూచించారు.









