కామారెడ్డి, 9 September
ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కామారెడ్డి జిల్లాలోని సరంపల్లి వార్డులో ఏడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ అధికారికంగా ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సరంపల్లి వార్డులో సీసీటీవీ కెమెరాల ప్రారంభం సరంపల్లి వార్డులో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కౌన్సిలర్ గంగాధర్ సహకారంతో ఏడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీటీవీ కెమెరాలను కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, సీసీటీవీ కెమెరాలు నేరాల నివారణతో పాటు ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరిస్తూ భద్రతా చర్యల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవనపల్లి ఎస్ఐ రంజిత్, కౌన్సిలర్ గంగాధర్, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












