కృత్రిమ మేధ () శిక్షణ కోసం సంస్థలు తమ డేటాను సురక్షితంగా వినియోగించుకునేలా, అదే సమయంలో ఆ డేటాపై నియంత్రణను కొనసాగించేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ () ఒక కొత్త హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ () ఫర్ ట్రైనింగ్ పేరుతో రూపొందించిన ఈ హ్యాండ్‌బుక్‌ను శనివారం బెంగళూరులో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఆవిష్కరించారు.
వ్యవస్థలకు శిక్షణ ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో విభిన్నమైన, నాణ్యమైన డేటా అవసరం. అయితే గోప్యత, సమాచార రహస్యాలు, మేధో సంపత్తి హక్కులు, సంస్థల డేటాపై నియంత్రణ వంటి అంశాల కారణంగా బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలు తమ డేటాను ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడుతుంటాయి. ఈ సమస్యలను పరిష్కరించడమే విధానం ప్రధాన లక్ష్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విధానం ద్వారా సంస్థలు తమ డేటాను పూర్తిగా ఇతరులకు అప్పగించకుండానే, నిర్దిష్ట ప్రయోజనాల కోసం శిక్షణలో ఉపయోగించుకునేందుకు సహకరించవచ్చు. ఇందుకోసం ఒప్పందపరమైన అనుమతులు, నియంత్రిత కంప్యూటింగ్ వాతావరణాలు, గోప్యతను కాపాడే భద్రతా చర్యలను ఇందులో పొందుపరిచారు. అలాగే డేటా ఎక్కడి నుంచి వచ్చింది, దాని వినియోగానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, శిక్షణ ప్రక్రియలో దాన్ని ఎలా ఉపయోగించారు అనే వివరాలను కూడా గుర్తించగలిగేలా డేటా ప్రోవెనెన్స్ వ్యవస్థను చేర్చారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది.










