ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ వైరం తీవ్రమైంది. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, నామినేషన్ల దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పలు చోట్ల అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
తాడేపల్లిలో న నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ, తమ పార్టీ అభ్యర్థులకు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఇవ్వలేదని, మరికొన్ని చోట్ల నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదని, పార్టీ కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు జరిగాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొన్ని ప్రాంతాల్లో అక్రమాలపై జగన్ ఆరోపణలు
టెక్కలి, కోటబొమ్మాళి, దర్శి, కనిగిరి, పలమనేరు, పులివెందుల వంటి ప్రాంతాల్లో జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. పోలింగ్ సమయంలో నమోదైన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ సమయంలో వెల్లడైన గణాంకాలకు మధ్య తేడాలు ఉన్నాయని కూడా అనుమానం వ్యక్తం చేశారు.










