తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా మండలం పెదవీడు గ్రామానికి చెందిన గాయం సైదిరెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ చంపాపేటలోని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ చంపాపేటలోని తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో, సంఘం రాష్ట్ర నాయకులు గాయం సైదిరెడ్డికి నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా గాయం సైదిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టం మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సంఘం నాయకులు, రెడ్డి బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు.











