తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో () విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023లో సైబర్ మోసాల వల్ల రూ.1,104.42 కోట్ల నష్టం సంభవించగా, 2024లో ఇది రూ.881.72 కోట్లకు తగ్గింది. ఈ తగ్గుదల పోలీసుల నిరంతర ప్రయత్నాలు, ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, సకాలంలో ఫిర్యాదులు చేయడం వంటి అంశాల ఫలితమని పేర్కొంది.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సైబర్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు
అక్టోబర్ నెలను సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసంగా తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ నెలలో 4,248 కార్యక్రమాలు నిర్వహించి, 2,78,428 మందికి అవగాహన కల్పించారు. మొత్తం మీద 2024 నాటికి 24,886 కార్యక్రమాల ద్వారా సుమారు 15.48 లక్షల మంది ప్రజలకు సైబర్ భద్రతపై సందేశాలు అందించారు.