దేశ టెలికాం రంగంలో కీలక మార్పులకు టెలికాం నియంత్రణ సంస్థ () శ్రీకారం చుట్టింది. 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, అన్ని కొత్త టెలికాం ఇంటర్కనెక్షన్లు ఇంటర్నెట్ ప్రోటోకాల్ () ఆధారితంగానే ఉండాలి. పాత 1/ సాంకేతికతతో నడుస్తున్న వ్యవస్థలను మార్చడానికి సంస్థలకు మూడేళ్ల గడువు ఇచ్చారు.
టెలికాం నెట్‌వర్క్‌ల మధ్య అనుసంధాన వ్యవస్థను ఆధునికీకరించే లక్ష్యంతో టెలికమ్యూనికేషన్ ఇంటర్కనెక్షన్ (థర్డ్ అమెండ్మెంట్) రెగ్యులేషన్స్2026ను విడుదల చేసింది. ఈ మార్పుల వల్ల బ్యాండ్‌విడ్త్ వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు కాల్ నాణ్యత, నెట్వర్క్ పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాత వ్యవస్థల స్థానంలో సాంకేతికత
ప్రస్తుతం వివిధ టెలికాం సంస్థల నెట్‌వర్క్‌లు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉండటం వల్లే వేర్వేరు సిమ్ నెట్‌వర్క్‌ల మధ్య కాల్స్, సందేశాలు సాధ్యమవుతున్నాయి. ఈ అనుసంధాన వ్యవస్థనే ఇంటర్కనెక్షన్ అంటారు. కొత్త నిబంధనల ప్రకారం పాత 1/ వ్యవస్థల స్థానంలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ () ఆధారిత సాంకేతికతను తీసుకురానున్నారు.












