తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని, ఒప్పంద పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.











