తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపై మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆలయ పుష్కరిణి సమీపంలో ఓ వాహనం ఢీకొనడంతో ఈశ్వరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఆలయ అధికారులు భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఆలయ కొండపై భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈశ్వరమ్మను ఓ వాహనం ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనం వేగం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











