సెనెగల్ రాజధాని డకార్‌లో జరగనున్న 2026 యూత్ ఒలింపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యువ అశ్విక క్రీడాకారుడు మంతెన శ్రేష్ట్ రాజు భారత్ తరఫున పోటీ పడనున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం అతడికి దక్కింది.
భారత క్రీడారంగానికి మరో శుభవార్త. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం హైదరాబాద్‌కు చెందిన యువ అశ్విక క్రీడాకారుడు మంతెన శ్రేష్ట్ రాజుకు దక్కింది. సెనెగల్ రాజధాని డకార్‌లో జరగనున్న 2026 యూత్ ఒలింపిక్స్‌లో అతడు భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అశ్వక్రీడల్లో వ్యక్తిగత జంపింగ్ విభాగంలో పోటీ పడనున్నాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హైదరాబాద్‌కు చెందిన మంతెన శ్రేష్ట్ రాజు ప్రస్తుతం 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రీడా వేదికపై తన ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. అతడు బెంగళూరులోని సర్జ్ స్టేబుల్స్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు.












