కామారెడ్డి, 27.7.2020
కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ జిల్లాస్థాయి కిడీ, జావలిన్, యూత్ సెలక్షన్స్ ఇందిర గాంధీ స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు Dr. M. Jaipal Reddy, రూరల్ CI శ్రీ. శ్రీధర్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.
నేడు కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ జిల్లాస్థాయి కిడీ, జావలిన్ మరియు యూత్ సెలక్షన్స్ స్థానిక ఇందిర గాంధీ స్టేడియం నందు ఉదయం 5:00 గం॥లకు ప్రారంభించబడినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అసోసియేషన్ అధ్యక్షులు Dr. M. Jaipal Reddy గారు మరియు కామారెడ్డి రూరల్ CI శ్రీ. శ్రీధర్ గౌడ్ గారు విచ్చేసి, పిల్లలను ఉల్సాహపరిచారు. రాష్ట్రస్థాయిలో మెడల్స్ సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని వారు పిల్లలను కోరారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అసోసియేషన్ అధ్యక్షులు Dr. M. Jaipal Reddy గారు ఎంపికైన పిల్లలకు మెడల్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి Dr. K.P. Anil Kumar, నవీన్, దత్తాద్రి, R శ్రీనివాస్, N. మధుసూదన్ రెడ్డి, శివగౌడ్, నరేష్ రెడ్డి, రేణుక, అరుణ, విజయ, సంత, లక్ష, లక్ష్మణ్ రాథోడ్, హనుమంత్ రెడ్డి, నవీన్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 7, 8వ తేదీల్లో జరగబోయే హనుమకాండ J.N stadiumలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.












