ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ అంబుజా సిమెంట్స్ తన వ్యాపార విస్తరణకు భారీ ప్రణాళికను ప్రకటించింది. సుమారు రూ.14,500 కోట్ల పెట్టుబడితో 30 మిలియన్ టన్నుల (30 ) అదనపు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు వెల్లడించింది. ఈ విస్తరణతో 2030 ఆర్థిక సంవత్సరం నాటికి సంస్థ మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 155 కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా అస్సాం, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త ఉత్పత్తి కేంద్రాలు, గ్రైండింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తూర్పు, పశ్చిమ, ఉత్తర భారత ప్రాంతాల్లో తమ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్రణాళికలో పశ్చిమ ప్రాంతంలో సుమారు 15.5 , తూర్పు ప్రాంతంలో 11.6 , ఉత్తర ప్రాంతంలో 2.9 గ్రైండింగ్ సామర్థ్యాన్ని జోడించనున్నారు.












